![]() |
![]() |

ఈవారం శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి ఫన్నీ సాంగ్స్ , డాన్సస్ పంచ్ డైలాగ్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో అభి మాష్టర్ అటు చంద్రముఖిని, ఇటు కాంచనని కలిపేసి రోహిణి, సత్యతో కలిసి రొమాంటిక్ డాన్సస్ చేసాడు. ఇక అభి మాస్టర్ ఐడియాకి అందరూ ఫిదా ఐపోయి ప్రశంసల జల్లు కురిపించారు. తర్వాత వాళ్ళ డాన్స్ టీమ్ లో ఉన్న రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. తమ కామెడీ టైమింగ్ ఏ పాటిదో చూడాలంటూ ఆదిని కూడా రిక్వెస్ట్ చేసాడు అభి మాస్టర్. ఇక మైక్ తీసుకుని తన పేరు రమేష్ అని చెప్పేసరికి ఆది పంచ్ వేసేశాడు. "తమ్ముడు నీ పేరు రమేషా.. పొరపాటున నువ్వు సెలెక్ట్ ఐతే తాగుబోతు రమేష్ కి స్కిట్లు ఇవ్వడం కష్టమవుతుంది" అనేసరికి "ఆయనకు కాదన్న మీకే కష్టం..ఎందుకంటే జనరల్ గా మీరే అందరి మీద నాన్స్టాప్ గా పంచులు వేస్తారు కదా. ఐనా ఇప్పటి వరకు ఆది అన్న చాలా పంచులు వేసాడు.
అదేంటన్న చిన్నప్పుడు అన్నప్రాసన రోజున అన్నీ వదిలేసి పంచెను పెట్టుకున్నారా ఏమిటి అందరిమీద అలా పంచులు వేస్తుంటారు. అందరి మీద చాలా పంచులు వేసాడేమో కానీ నా మీద ఒక్క పంచ్ కూడా వేయలేదు. ఎందుకంటే ఆయన పంచులు వేసేటప్పుడు నేను పక్కన లేను కాబట్టి" అని ఆదికి కౌంటర్ ఇచ్చాడు. తర్వాత సుమన్ శెట్టిలా ఏడుపు మిమిక్రి చేసి ఎంటర్టైన్ చేసాడు. " ఇవన్నీ చూసి వీళ్ళు గనక నాకు ఒక ఛాన్స్ ఇచ్చారనుకో ..ఇక నుంచి మీరు పంచులు కాదు కదా పంచులు మీద ఉన్న అంచులను కూడా తాకనివ్వను" అంటూ కామెడీ చేసాడు. ఇక రమేష్ కామెడీకి ఆది ఫిదా ఐపోయాడు. ఇంతమంది ముందు ఒకేసారి అంత ఫ్లోలో డైలాగ్స్ చెప్పి మిమిక్రీ చేసాడంటే చాలా గ్రేట్ అంటూ పొగిడేశారు. తర్వాత తన తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోయారని...తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా లేరని బాధపడ్డాడు. కానీ బయట ఎంతో మంది అవయవాలు లేక బాధపడుతున్నారని కానీ దేవుడు తనకు అన్ని చక్కగా ఇచ్చాడు అంటే దానికి ఏదో కారణం ఉంటుందని చెప్తూ తన లక్ష్యం దిశగా ప్రయాణిస్తాను అని చెప్పాడు డాన్సర్ రమేష్.
![]() |
![]() |